ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) సమక్షంలో భారత్(India), శ్రీలంకల(Sri Lanka) మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. విస్తృత చర్చల తర్వాత ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు భారత్‌, శ్రీలంకలు శుక్రవారం ఒక ప్రతిష్టాత్మక విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించాయి. ఈ సందర్భంగా "ఈ రోజు మనం మన ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను(Vision Document) స్వీకరించాము.

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) సమక్షంలో భారత్(India), శ్రీలంకల(Sri Lanka) మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. విస్తృత చర్చల తర్వాత ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు భారత్‌, శ్రీలంకలు శుక్రవారం ఒక ప్రతిష్టాత్మక విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించాయి. ఈ సందర్భంగా "ఈ రోజు మనం మన ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను(Vision Document) స్వీకరించాము. ఈ దృక్పథం రెండు దేశాల ప్రజల మధ్య సముద్ర, వాయు, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడమ‌ని ప్రధాని అన్నారు.

గత ఏడాది శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. సంక్షోభ సమయంలో భారతదేశం శ్రీలంక‌ ప్రజలతో సన్నిహిత మిత్రునిగా మెలిగింద‌న్నారు. శ్రీలంకలో యూపీఐ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించేందుకు కుదిరిన‌ ఒప్పందం వల్ల ఇరుపక్షాల మధ్య ఫిన్‌టెక్ కనెక్టివిటీ(FinTech Connectivity) పెరుగుతుంద‌ని ప్రధాని చెప్పారు.

గత ఏడాది కాలంగా శ్రీలంక ప్రజలకు సవాళ్లతో కూడుకున్నదని, ఆప్తమిత్ర దేశంగా భారత్ ఎప్పటిలాగే శ్రీలంక ప్రజలకు భుజం భుజం కలిపి నిలుస్తుందన్నారు. భారత్‌, శ్రీలంక దేశాల భద్రతా ప్రయోజనాలు, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని.. భద్రతా ప్రయోజనాలను, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కలిసి పనిచేయడం అవసరమని మోదీ అన్నారు. ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించిన విజన్ పేపర్‌ను ఆమోదించినట్లు మోదీ తెలిపారు.

పర్యాటకం, విద్యుత్తు, వాణిజ్యం, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, కనెక్టివిటీ రంగాల్లో పరస్పర సహకారాన్ని వేగవంతం చేసే దృక్పథం ఉందన్నారు. సముద్ర, వాయు, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేసే లక్ష్యంతో ఇరుదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆర్థిక, సాంకేతిక సహకారంపై ఒప్పందంపై త్వరలో చర్చలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. తమిళ సమాజం ఆకాంక్షలను శ్రీలంక ప్రభుత్వం నెరవేరుస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-శ్రీలంక పెట్రోలియం పైప్‌లైన్‌పై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనున్నట్లు మోదీ తెలిపారు. మత్స్యకారుల సమస్యపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ప్రధాని అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు మాట్లాడుతూ.. 'భారత అభివృద్ధి దాని పొరుగు ప్రాంతాలకు.. హిందూ మహాసముద్ర ప్రాంతానికి ప్రయోజనకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నామని అన్నారు.

Updated On 21 July 2023 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story