రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) గవర్నర్‌(Governor) శక్తికాంత దాస్‌(Shaktikanta das) ద్రవ్య విధాన నిర్ణయాన్ని ప్రకటించారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) గవర్నర్‌(Governor) శక్తికాంత దాస్‌(Shaktikanta das) ద్రవ్య విధాన నిర్ణయాన్ని ప్రకటించారు. విశ్లేషకులు ఊహిస్తున్నట్టుగానే కీలక రేట్లను యథాతథంగా కొనసాగించారు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం దగ్గర కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు దీన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది తొమ్మిదోసారి. మానటరీ పాలసీ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. నైరుతి రుతుపవనాల(Monsoon) వల్ల ఆహార ద్రవ్యోల్పణం దిగి వస్తుందని కమిటీ ఆశిస్తోంది. ముఖ్యమైన నిర్ణయమేమిటంటే యూపీఐ పన్ను(UPI Tax) చెల్లింపు పరిమితి(Limit) లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం. బ్యాంకు రుణాల విస్తరణ నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడులు ఊపందుకుంటున్నాయని, బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్‌ షీట్లు ఆరోగ్యకరంగా ఉన్నాయని, ప్రభుత్వం మూలధనం వ్యయాలపై దృష్టి సారిస్తోందని, ఈ నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయని ఎంపీసీ సమావేశం తేల్చింది. 2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు అంచనా 7.2 శాతం. ఒకటి, రెండు, నాలుగో త్రైమాసికంలో 7.2 శాతం, మూడో క్వార్టర్‌లో 7.3 శాతంగా ఉండవచ్చని తెలిపింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story