ద్రవ్య విధాన కమిటీ (MPC) తన సమీక్షా సమావేశాన్ని డిసెంబర్ 6న నిర్వహించింది.

ద్రవ్య విధాన కమిటీ (MPC) తన సమీక్షా సమావేశాన్ని డిసెంబర్ 6న నిర్వహించింది. ఉత్పాదక రంగ వృద్ధి గణనీయంగా క్షీణించడం వల్ల ఊహించిన దాని కంటే వృద్ధి చాలా తక్కువగా ఉంది. ఆర్థిక కార్యకలాపాల మందగమనం రెండో త్రైమాసికంలో అట్టడుగున పడిపోయింది.

పారిశ్రామిక కార్యకలాపాలు కూడా పుంజుకునే అవకాశం ఉంది. అధిక ద్రవ్యోల్బణం, జీడీపీ తిరోగమనంతో ఆర్‌బీఐ రెపో రేటు(RBI RepoRate)ను 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. తక్కువ GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితిపై ఆందోళనలు రావడంతో యథాతథ స్థితిని కొనసాంగించాల్సి వచ్చిందని శక్తికాంతదాస్‌ తెలిపారు. జూలై-సెప్టెంబర్ 2024 త్రైమాసికంలో జీడీపీ కనిష్ట స్థాయి 5.4 శాతానికి పడిపోయింది.

Updated On
ehatv

ehatv

Next Story