రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్‌ బిధూరి అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేశారు.

రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్‌ బిధూరి అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. తాను గెలిస్తే నియోజకవర్గంలోని రోడ్లను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) చెంపలంతా నునుపుగా మారుస్తానని చెప్పడంపై జనం మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ సహచర ఎంపీని దూషించి ఎలాంటి శిక్ష అనుభవించని వ్యక్తి నుంచి ఇంతకు మించిన ప్రవర్తన ఏం ఆశిస్తామని కాంగ్రెస్ విమర్శించింది. సర్వత్రా విమర్శలు వస్తుండటంతో బిధూరీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఇంతేనా.. ఈయన గారు ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి ఆతిశీపైనా బిధూరీ(Bidhuri) పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆతిశీ తన తండ్రి పేరునే మార్చేశారని ఏకసెక్కాలు చేశారు. ఒకప్పుడు మర్లేనాగా ఉన్న ఆతిశీ ఇప్పుడు సింగ్‌ అయ్యారని, ఆమె తన తండ్రినే మార్చేశారని అన్నారు. బిధూరీవ్యాఖ్యలపై ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా అన్ని హద్దులు దాటేశారని ఆయన విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని బీజేపీ నాయకులు దుర్భాషలాడుతున్నారని, ఒక మహిళా ముఖ్యమంత్రిని అవమానించడాన్ని ఢిల్లీ ప్రజలు సహించరని కేజ్రీవాల్ అన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story