కులవ్యవస్థ(caste system) చాలా మంచిదట! కుల వ్యవస్థ కారణంగానే భారతదేశం ఐక్యంగా ఉందట!

కులవ్యవస్థ(caste system) చాలా మంచిదట! కుల వ్యవస్థ కారణంగానే భారతదేశం ఐక్యంగా ఉందట! ఈ మాటలన్నది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS). అయ్యో .. ఎంతమాట అనేసింది అని హైరానా పడకండి. రాజ్యాంగం కంటే మనుస్మృతినే ఎక్కువగా ఆరాధించే ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలే కదా వచ్చేవి! మన దేశంలో కుల వ్యవస్థ చాలా చెడ్డదని, కులాల కారణంగానే సమాజంలో అంతరాలు ఉన్నాయని చెబుతుంటారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం భిన్నమైన కామెంట్లు చేసింది. కులాలు ఉన్నాయి కాబట్టే కుల ఘర్షణలు జరుగుతున్నాయి. ఊచకోతలు జరుగుతున్నాయి. మారణకాండలు చోటు చేసుకుంటున్నాయి. వెలివేతలు ఉంటున్నాయి. ఆధిపత్య కులాలు కింది కులాలను అణిచివేయడం అనాదిగా వస్తున్న విషయం మనకు తెలిసిందే!

ఆర్‌ఎస్‌ఎస్‌ అధికారపత్రిక పాంచజన్య(Panchajanya) మాత్రం కుల వ్యవస్థను గట్టిగా సమర్థించింది. కుల వ్యవస్థ ఉన్నది కాబట్టే భారతదేశం ఐక్యంగా ఉందని చెప్పుకొచ్చింది. మొగల్‌ పాలకులు కుల వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని, బ్రిటిష్ పాలకులు మాత్రం విభజించి పాలించు అనే సిద్ధాంతంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని ఆర్‌ఎస్‌ఎస్‌ అంటోంది. ఇంత సడన్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ మాట ఎందుకన్నదంటే కాంగ్రెస్‌ పార్టీ కుల గణన చేయాలని డిమాండ్‌ చేయడమే! కులగణనను విమర్శిస్తూ కుల వ్యవస్థను సమర్థించింది ఆర్‌ఎస్‌ఎస్‌. హిందువుల ఓట్లను చీల్చడానికే కాంగ్రెస్‌ కులగణనను ముందుకు తెచ్చిందని, బ్రిటిషర్ల మెంటాలిటీ, కాంగ్రెస్‌ పార్టీ మెంటాలిటీ ఒక్కలాగే ఉంటాయని విమర్శించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story