రష్యాలో(Russia) అధ్యక్ష ఎన్నికలు(President election) శుక్రవారం అంటే మార్చి 15వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల పోలింగ్‌(Polling) మన దేశంలోని కేరళ(Kerala) రాజధాని తిరువనంతపురంలో(thiruvana) కూడా జరుగుతోంది.

రష్యాలో(Russia) అధ్యక్ష ఎన్నికలు(President election) శుక్రవారం అంటే మార్చి 15వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల పోలింగ్‌(Polling) మన దేశంలోని కేరళ(Kerala) రాజధాని తిరువనంతపురంలో(thiruvana) కూడా జరుగుతోంది. ఆశ్చర్యపోకండి.. కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు ఓటు హక్కును వినియోగించుకోవాలి కదా! వారి కోసం తిరువంతపురంలోని రష్యా కాన్సులేట్‌లో ఈ ఏర్పాటు చేశారు. ఇదేం మొదటిసారి కాదు. ఇక్కడ నివసిస్తున్న రష్యన్ల కోసం పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇది మూడోసారి. నివాసం ఉంటున్న వారికే కాదు, పర్యాటకులుగా వచ్చిన రష్యన్ల కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మార్చ్‌ 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతుంది. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌తో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడాన్ని సమర్థించినవారే! ఈ ఎన్నికల్లో కూడా పుతిన్‌ సునాయాసంగా విజయం సాధిస్తారని విశ్లేషకులు అంటున్నారు.

Updated On 15 March 2024 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story