మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్‌లు, మిసైళ్లు, ఫైటర్ జెట్‌లను S-400 వ్యవస్థ నిర్వీర్యం చేసింది.

మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్‌లు, మిసైళ్లు, ఫైటర్ జెట్‌లను S-400 వ్యవస్థ నిర్వీర్యం చేసింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లలో దాడులను విఫలం చేసింది. S-400 ఒకేసారి 72 మిసైళ్లను ప్రయోగించగలదు, హైపర్‌సోనిక్ (Hyper sonic)ఆయుధాలను కూడా ఎదుర్కొనగలదు. దీని రాడార్ వ్యవస్థ పాకిస్తాన్(Pakistan), చైనా (China)సరిహద్దులలో సుదూరంగా నిఘా కలిగి ఉంటుంది.
మనోహర్ పారికర్, భారత మాజీ రక్షణ మంత్రిగా, S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందం భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో మైలురాయిగా నిలిచింది, ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్(S-400 Triumph, Manohar Parrikar, Operation Sindoor, air defense, missile system, India, Russia, Pakistan, China, radar, stealth, ballistic missiles, strategic deal) సందర్భంలో S-400 ప్రభావం స్పష్టంగా కనిపించింది. S-400 సముపార్జన గురించి చర్చలు 2015లో మొదలయ్యాయి. రష్యా అల్మాజ్ ఆంటీ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ, 380-400 కి.మీ. పరిధిలో శత్రు యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లు, స్టెల్త్ ఫైటర్లను కూడా కూల్చగల సామర్థ్యం కలిగి ఉంది. 2016 అక్టోబర్ 15న, బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్-రష్యా మధ్య ఐదు S-400 రెజిమెంట్ల సరఫరాకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అధికారికంగా 2018 అక్టోబర్ 5న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా సంతకం చేయబడింది. ఒప్పందం విలువ సుమారు 5.43 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.40,000 కోట్లు
మనోహర్ పారికర్ (Manohar Parrikar)పాత్ర: ఈ వ్యూహాత్మక నిర్ణయం వెనుక 2014-2017 మధ్య రక్షణ మంత్రిగా ఉన్న పారికర్, భారత వైమానిక రక్షణ వ్యవస్థలను ఆధునీకరించేందుకు ఆయన కృషి చేశారు. ఖరీదైన షార్ట్-రేంజ్ మిసైళ్ల కొనుగోలును తగ్గించి, S-400 వంటి లాంగ్-రేంజ్, అత్యాధునిక వ్యవస్థలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. S-400 కొనుగోలుపై అమెరికా నుంచి ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ, పారికర్ దృఢంగా నిలిచి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ వ్యవస్థ భారత రక్షణకు కీలకమని ఆయన నొక్కి చెప్పారు.పారికర్ ఆధ్వర్యంలో వైమానిక దళం అన్ని అందుబాటులో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను సాంకేతికంగా అంచనా వేసింది. S-400 యొక్క రాడార్ సామర్థ్యాలు, గతిశీలత, మరియు 40-400 కి.మీ. పరిధి దీనిని ఎంపిక చేయడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ వ్యవస్థలు చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి మోహరించారు. గగనతల దాడుల నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ విజయాన్ని పారికర్‌కు అంకితం చేస్తూ అనేక పోస్ట్‌లు వచ్చాయి, ఆయన లేనప్పటికీ దేశ రక్షణకు ఆయన పాటుపడుతున్నారని పలువురు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
