Sai Sudharshan : వారెవ్వా.. ఏం క్యాచ్‌రా బాబూ..!
సాతాఫ్రికాతో(South Africa) జరిగిన మూడో వన్డేలో(One Day) అద్భుత క్యాచ్‌ను భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ సాయిసుదర్శన్(Sai Sudharshan) అందుకున్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో తన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న సాయి సుదర్శన్ మూడో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో(Feilding) సత్తా చాటాడు. కీలకమైన మూడో వన్డేలో కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకొని ఆకట్టుకున్నాడు.

Sai Sudharshan

భారత బౌలర్ ఆవేశ్ ఖాన్(Aavesh Khan) బౌలింగ్‌లో (32.2వ ఓవర్) మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సాయి చిరుతలా దూకి బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో ఈ క్యాచ్ బాధితుడైన సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ ఆశ్చర్యపోయాడు. క్యాచ్ చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. కామెంటేటర్లు అయితే దీనిని క్యాచ్ ఆఫ్ ద సిరీస్‌గా పేర్కొంటూ సాయిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ వీడియో ఇప్ఉడు నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 43 బంతుల్లో 55 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. రెండో మ్యాచ్‌లో 62 పరుగులు చేసి సత్తా చాటాడు.