రైళ్లను పట్టాలు తప్పించేందుకు ఉన్మాదులు కుట్రలు పన్నుతున్నారు.

రైళ్లను పట్టాలు తప్పించేందుకు ఉన్మాదులు కుట్రలు పన్నుతున్నారు. రైల్వే ట్రాక్‌లపై గ్యాస్‌ సిలిండర్లు(Gas Cylinder), ఇనుప పట్టీలు ఉంచుతూ రైళ్లను పట్టాలు తప్పించే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. లేటెస్ట్‌గా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని రాయ్‌బరేలీ (Raebareli)జిల్లాలో మరో సంఘటన చోటు చేసుకుంది. ఖీరూన్‌ పోలీస్‌స్టేషన్‌ (Kheeroon Police Station)పరిధిలోని రఘురాజ్‌ సింగ్‌ రైల్వే స్టేషన్‌(Raghuraj Singh Railway Station) సమీపంలో రైలు పట్టాలపై కొందరు దుండగులు ఇసుకను పోశారు. ఇసుక కుప్పను చూసిన లోకో పైలట్‌ అప్రమత్తమయ్యారు. రైలును ఆపేసి ప్రమాదం తప్పించారు. ట్రాక్‌పై నుంచి దానిని తొలగించిన తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Updated On
ehatv

ehatv

Next Story