పాకిస్తాన్‌(Pakistan) మాజీ క్రికెట్ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌(shoaib malik) ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. మన హైదరాబాద్‌ అల్లుడైన షోయబ్‌ మాలిక్‌ భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను(sania Mirza) మోసం చేసి పెళ్లి చేసుకున్నాడేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సానియా మీర్జాను పెళ్లి చేసుకోవడానికి ముందు హైదరాబాద్‌కే చెందిన ఉపాధ్యాయురాలు ఆయేషా సిద్ధిఖీని(Ayesh Siddiq) పెళ్లి చేసుకున్నాడు.

పాకిస్తాన్‌(Pakistan) మాజీ క్రికెట్ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌(shoaib malik) ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. మన హైదరాబాద్‌ అల్లుడైన షోయబ్‌ మాలిక్‌ భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను(sania Mirza) మోసం చేసి పెళ్లి చేసుకున్నాడేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సానియా మీర్జాను పెళ్లి చేసుకోవడానికి ముందు హైదరాబాద్‌కే చెందిన ఉపాధ్యాయురాలు ఆయేషా సిద్ధిఖీని(Ayesh Siddiq) పెళ్లి చేసుకున్నాడు. సానియాతో పెళ్లికి కొన్ని రోజుల ముందు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనను 2002లో పెళ్లి చేసుకున్నాడని చెబుతూ నిఖాహనామా కాపీలను ఆయేషా సిద్ధిఖీ మీడియాకు చూపించారు. అప్పుడు కానీ షోయబ్‌కు పెళ్లి అయ్యిందన్న విషయం తెలియలేదు. తనకు విడాకులు ఇవ్వకుండానే సానియా మీర్జాతో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ కోర్టును ఆశ్రయించారు అయేషా. మొదట ఆయేషా అబద్దాలు ఆడుతున్నారంటూ చెప్పిన షోయబ్‌ మాలిక్‌ చివరకు పెళ్లి చేసుకున్నానని ఒప్పుకున్నాడు.

2010, ఏప్రిల్‌ 7వ తేదీన ఆయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చారు.దాంతో పాటు 15 కోట్ల రూపాయల భరణాన్ని కూడా ఇచ్చాడని అంటుంటారు. తర్వాత సానియాను పెళ్లి చేసుకున్నాడు షోయబ్‌! 2018లో వీరికి ఇజాన్‌ అనే కుమారుడు జన్మించాడు. లేటెస్ట్‌గా అంటే జనవరి 20వ తేదీన పాపులర్‌ పాకిస్తాన్‌ నటి సనా జావెద్‌ను(Sana Javed) పెళ్లి చేసుకున్నానని సోషల్‌ మీడియాలో ఫోటోను షేర్‌ చేశాడు షోయబ్‌. షోయబ్‌, సనా పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతున్నాయి. సనా జావెద్‌కు కూడా ఇది రెండో పెళ్లి. 2012లో టెలివిజన్‌ ఇండస్ట్రీలోకి వచ్చిన సనా అనేక సీరియల్స్‌లో నటించారు. షెహర్-ఎ-జాత్, ప్యారే అఫ్జల్, జరా యాద్ కర్, రుస్వాల్, డంక్, ఇంతేజార్ వంటివి ఆమెకు మంచి పేరు తెచ్చాయి.

రొమాంటిక్ డ్రామా ఖానీలో టైటిల్ రోల్‌ద్వారా బాగా పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం ARY డిజిటల్ డ్రామా, సుకూన్‌లో నటిస్తున్నారు. షోయబ్‌ మాలిక్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు పాకిస్తాన్‌ గాయకుడు ఉమైర్‌ జస్వాల్‌ను 2020లో పెళ్లి చేసుకున్నారు సనా. కొన్నాళ్లు వీళ్ల కాపురం సజావుగానే సాగింది. అప్పుడు సోషల్‌ మీడియాలో వీరిద్దరు రోజుకో ఫోటోను షేర్‌ చేసేవారు. ఓ రోజు సడన్‌గా వీరి పోస్టులు ఆగిపోయాయి. అప్పుడే చాలా మందికి డౌట్స్ వచ్చాయి. వీరిద్దరు విడిపోవడం ఖాయమనిపించింది. లాస్టియర్‌ నుంచి షోయబ్‌ మాలిక్‌కు దగ్గరయ్యారు సనా. లాస్టియర్‌ మార్చి 25వ తేదీన సనా పుట్టిన రోజును పురస్కరించుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా హ్యాపీ బర్త్‌డే బడ్డీ అంటూ సనాకు విషెస్‌ చెప్పాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. ఆ విధంగా సనాపై తనకున్న ప్రేమను షోయబ్‌ అలా చాటుకున్నారు. ఇదిలా ఉంటే సానియా మీర్జా షాక్‌లోకి వెళ్లింది. జీవితం అంటే అంత ఈజీ కాదని, జీవితంలో పెళ్లి, విడాకులు(Divorce) రెండూ కష్టమేనని వ్యాఖ్యానించింది. ఈ రెండు దారులలో ఒకదానిని ఎంచుకోవడం చాలా కష్టమంటూ ఓ పోస్ట్‌ను షేర్‌ చేసింది.

Updated On 20 Jan 2024 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story