మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే(Eknath shinde) వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌(Sanjay Gaikwad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే(Eknath shinde) వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌(Sanjay Gaikwad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) నాలుక(Tounge) కోసిన వారికి 11 లక్షల రూపాయలు కానుకగా ఇస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ అమెరికాలో రిజర్వేషన్ల గురించి ఏదో అన్నారట! అందుకే నాలుక కోసిన వారికి భారీ నజరానా ఇస్తానని అంటున్నారు. 'ఇటీవల అమెరికా పర్యటనలో రిజర్వేషన్‌లను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. రిజర్వేషన్‌లను అంతర్లీనంగా వ్యతిరేకించే ఆయన మనస్తత్వాన్ని ఇది చూపుతున్నది. రాహుల్ గాంధీ నాలుకను కోసే ఎవరికైనా నేను 11 లక్షల రూపాయలు రివార్డ్‌ ఇస్తా’ అని సంజయ్‌ గైక్వాడ్‌ ప్రకటించారు. తన వ్యాఖ్యలతో రాహుల్‌ ప్రజలకు అతి పెద్ద ద్రోహం చేశారన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story