సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది.

సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రతీ ఏడాది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ సారి కూడా పండగకు సొంతూరు వెళ్లే ప్రయాణికుల ప్రత్యేక రైళ్లను నడుపుతామని ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వీటిని నడపనుంది. పండుగ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నుంచి లక్షల మంది జనం సొంతూళ్ల ప్రయాణమవుతారు. వీరి రద్దీతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. రైళ్లల్లో ఖాళీ దొరక్క ఇతర మార్గాల్లో చాలామంది సొంతూళ్లకు చేరుకుంటారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే నడపనుంది. సికింద్రాబాద్-శ్రీకాకుళం (07288) ప్రత్యేక రైలు 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. సాయంత్రం 19.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళంకు చేరుకోనుంది. ఇక ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 15.30కు శ్రీకాకుళంలో బయల్దేరి తర్వాతి రోజు 8.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఇక మరో రైలు సికింద్రాబాద్-శ్రీకాకుళం(07290) సమయాలు కూడా అలాగే ఉన్నాయి. అలాగే వికారాబాద్-శ్రీకాకుళం(07294) సా. 17.15 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 15.30 గంటలకు శ్రీకాకుళం నుంచి బయల్దేరి తర్వాతి రోజు 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్-శ్రీకాకుళం(07292) వచ్చే నెల 17వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఇది 19.00 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళానికి చేరుకుంటుది. తిరుగ ప్రయాణంలో శ్రీకాకుళంలో 15.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 08.10 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది.

Updated On
ehatv

ehatv

Next Story