కొరియా ఓపెన్ పురుషుల బ్యాడ్మింట‌న్‌ డబుల్స్ ఫైనల్లో(Korea Open Men's Badminton Doubles Final) గెలిచి సాత్విక్(sathwik)-చిరాగ్(chirag) జోడీ టైటిల్ సాధించింది. సాత్విక్-చిరాగ్ ల జోడీ ఇండోనేషియాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ జంట‌ ఫజర్ అల్ఫియాన్(Fajr Alfian)-మహమ్మద్ రియాన్ ఆర్డియాంటోను(Mohammed Ryan Ordianto) ఓడించి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని సాధించింది.

కొరియా ఓపెన్ పురుషుల బ్యాడ్మింట‌న్‌ డబుల్స్ ఫైనల్లో(Korea Open Men's Badminton Doubles Final) గెలిచి సాత్విక్(sathwik)-చిరాగ్(chirag) జోడీ టైటిల్ సాధించింది. సాత్విక్-చిరాగ్ ల జోడీ ఇండోనేషియాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ జంట‌ ఫజర్ అల్ఫియాన్(Fajr Alfian)-మహమ్మద్ రియాన్ ఆర్డియాంటోను(Mohammed Ryan Ordianto) ఓడించి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ 17-21, 21-13, 21-14 తేడాతో ఇండోనేషియా జంట‌పై విజయం సాధించింది. సాత్విక్-చిరాగ్ జోడికి ఈ ఏడాది ఇది మూడో టైటిల్‌. కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేతలైన‌ సాత్విక్-చిరాగ్ ద్వయం.. 2023 బీడ‌బ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో భాగంగా ఇప్పటికే స్విస్, ఇండోనేషియా ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నారు.

Updated On 23 July 2023 3:12 AM GMT
Ehatv

Ehatv

Next Story