దేశ రాజ‌ధాని ఢిల్లీ లోని ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లోని సమ్మర్ ఫీల్డ్ స్కూల్‌ కు బాంబు బెదిరింపు వచ్చింది

దేశ రాజ‌ధాని ఢిల్లీ(Delhi)లోని ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లోని సమ్మర్ ఫీల్డ్ స్కూల్‌(Summer Feild School)కు బాంబు బెదిరింపు(Bomb Threat) వచ్చింది. దుండ‌గులు పాఠశాలకు బెదిరింపు ఈమెయిల్ చేశారు. దీంతో స్కూల్ యాజ‌మాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ముందుజాగ్రత్తగా పోలీసులు పాఠశాలను ఖాళీ చేయించారు. అనంతరం అంబులెన్స్, బాంబ్ డిఫ్యూజ్ స్క్వాడ్, ఇతర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసుల త‌నిఖీల్లో పాఠశాలలో అన‌మానిత వ‌స్తువులేమీ క‌నిపించ‌లేదు.

సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ షాలినీ అగర్వాల్(shalini Agarwal) మాట్లాడుతూ.. మాకు అర్థరాత్రి ఈమెయిల్(Email) వచ్చిందని.. ఈ ఉదయం చూసిన‌ట్లు తెలిపారు. మేము ఈమెయిల్‌ను చూసిన‌ 10 నిమిషాలలోపే విద్యార్థులను స్కూలులోంచి ఖాళీ చేయించాము. పోలీసులకు, జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించామ‌ని తెలిపింది. వెంటనే వచ్చి మాకు మద్దతు ఇచ్చినందుకు మేము పోలీసుల(POlice)కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ విద్యార్థులు ఎవరూ లేరు.. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను తీసుకువెళ్లే వరకూ మేము వేచి ఉన్నాము. పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఇక్కడ ఉన్నారని తెలిపారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story