స్మితా సబర్వాల్‌ గురించి తెలియని తెలుగువారు ఉండరు. ఐఏఎస్‌ అధికారిణి అయిన ఆమె వివాదాలకు, సంచలనాలకు పెట్టింది పేరు.

స్మితా సబర్వాల్‌ గురించి తెలియని తెలుగువారు ఉండరు. ఐఏఎస్‌ అధికారిణి అయిన ఆమె వివాదాలకు, సంచలనాలకు పెట్టింది పేరు. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో ఓ సంచలన పోస్ట్‌ పెట్టారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందేనంటూనే ఆల్‌ ఇండియా సర్వీసెస్‌లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు ? అని ప్రశ్నిస్తున్నారు స్మిత సబర్వాల్‌. క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన ఉద్యోగాలలో కోటా ఎందుకంటున్నారు. డెస్క్‌లో పని చేసే ఉద్యోగాలలో కోటా ఉండాలనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అఖిల భారత సర్వీసెస్‌లో వెనుకబడిన తరగతులకు చెందిన అధికారుల వారసులకు రిజర్వేషన్‌లు ఎందుకని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు స్మితా సబర్వాల్ జవాబిస్తూ రిజర్వేషన్‌లు వారికి ఇవ్వొద్దన్నారు. ట్రైయినీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌, యూపీఎస్‌సీ ఛైర్మన్‌ రాజీనామాపై స్మిత స్పందించారు. బాధ్యత లేకుండా రాజీనామా ఎలా చేస్తారు అని ప్రశ్నించిన స్మిత అవకతవకలు తేల్చకుండా తప్పించుకోలేరన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story