ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠ్‌కు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి కొత్త వాదన తీసుకొచ్చారు.

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని జ్యోతిష్ పీఠ్‌( Jyotirmath Peeth )కు చెందిన శంకరాచార్య స్వామి (Shankaracharya)అవిముక్తేశ్వరానంద సరస్వతి కొత్త వాదన తీసుకొచ్చారు. ఇక నుంచి ఆవును జంతువని అనకూడదన్నారు. జంతువుల వర్గం నుంచి ఆవును మినమాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆవును జంతువుగా చూస్తున్నదని, సనాతన ధర్మంలో ఆవును తల్లిలా చూస్తారని అవిముక్తేశ్వరానంద సరస్వతి(Avimukteswarananda Saraswati) చెప్పారు. ఆవును జంతువని అనడం సనాతన ధర్మాన్ని అవమానించినట్టే అవుతుందని అభిప్రాయపడ్డారు. మాతృ గోవుల రక్షణ, ప్రోత్సాహం కోసం ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించాలని కోరుతూ ఆయన ఓ యాత్ర చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story