ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దొంగలను ఓ వీరనారి అడ్డుకుంది.

ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దొంగలను ఓ వీరనారి అడ్డుకుంది. బలవంతంగా తలుపు తెరచి లోపలికి వచ్చేందుకు దొంగలు చేసిన ప్రయత్నాన్ని ఇంట్లో ఉన్న మహిళ ఒంటరిగా ఎదుర్కొంది. తన శక్తినంతా ప్రయత్నించి వారు తలుపు తెరవకుండా అడ్డుకున్నది. భయపడుతున్న పిల్లలకు ధైర్యం చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గత నెల 30వ తేదీ సాయంత్రం జరిగింది. నగల వ్యాపారి అయిన జగ్జీత్‌ సింగ్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంట్లో ఆయన భార్య మన్‌దీప్‌ కౌర్‌, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. బట్టలారేస్తున్న మన్‌దీప్‌ కౌర్‌కు ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులను ఇంటి దగ్గర తచ్చాడుతుండటాన్ని గమనించింది. వారు గోడ దూకి ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకుని బలవంతంగా తలుపు తెరిచే ప్రయత్నం చేశారు. వెంటనే ఆమె వారు తలుపు తెరవకుండా తన బలాన్నంతా ఉపయోగించింది. గట్టిగా అరుస్తూ డోర్‌ లాక్‌ చేసింది. జాగ్రత్త కోసం సోఫాను డోర్‌ ముందుకు లాగింది. కొడుకు, కూతురుకు ధైర్యం చెప్పింది. పోలీసులకు, భర్తకు ఫోన్‌ చేసింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story