Miss World Finals : డ్యాన్స్‌తో అదరగొట్టిన సినీ షెట్టి
సుదీర్ఘకాలం తర్వాత మిస్ వరల్డ్ పోటీలు(Miss World Competitions) మన దగ్గర జరుగుతున్నాయి. 28 ఏళ్ల కిందట మిస్ వరల్డ్ ఎడిషన్‌కు ఇండియా వేదికగా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి ఆ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్నది. ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి అందమైన భామలు పాల్గొంటున్నారు. అందమే కాదు, తమ ప్రతిభను కూడా చాటుకునేందుకు పోటీపడుతున్నారు.

Miss World Finals
సుదీర్ఘకాలం తర్వాత మిస్ వరల్డ్ పోటీలు(Miss World Competitions) మన దగ్గర జరుగుతున్నాయి. 28 ఏళ్ల కిందట మిస్ వరల్డ్ ఎడిషన్‌కు ఇండియా వేదికగా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి ఆ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్నది. ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి అందమైన భామలు పాల్గొంటున్నారు. అందమే కాదు, తమ ప్రతిభను కూడా చాటుకునేందుకు పోటీపడుతున్నారు. ఇండియా నుంచి కన్నడ ముగ్ధమనోహరం సినీ షెట్టి(Sini Shetty) మిస్ వరల్డ్ టైటిల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 21 ఏళ్ల ఈ అందాల సుందరి ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న టాప్ 20లో ఉన్నారు.
1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) గెల్చుకున్నారు. అప్పటి నుంచి మిస్ వరల్డ్ పోటీలకు మన దగ్గర ఆదరణ పెరిగింది. ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుని మూడు దశాబ్దాలు అవుతోంది. ఈ సందర్భంగా 2024 మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్స్ రౌండ్‌లో ఐశ్వర్యారాయ్ హిట్ పాటలకు సినీ షెట్టి డ్యాన్స్ చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా నుంచి నింబుడా సాంగ్‌తో సినీ షెట్టి దుమ్మరేపారు. తర్వాత తాల్, బంటీ ఔర్ బబ్లీ సినిమాల్లోని హిట్ సాంగ్స్‌కు కళ్లు చెదిరే డాన్స్‌ను ప్రదర్శించారు. అటు పిమ్మట తన డాన్స్ ప్రదర్శనను ఐశ్వర్యారాయ్‌కు అంకితమిచ్చారు సినీ షెట్టి. ఆమె చేసిన డాన్స్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్యారాయ్ వారసత్వానికి గుర్తుగా అటు శాస్త్రీయము, ఇటు బాలీవుడ్ నృత్య రీతులను కలగలపి సినీ షెట్టి డాన్స్‌లు చేశారు. ఆమె టాలెంట్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మిస్ వరల్డ్ 204 ఫైనల్ పోటీ ఈ నెల 9వ తేదీన ముంబాయిలో జరుగుతుంది. ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు మన దేశానికి ఆ అవకాశం వచ్చింది. మన సినీ షె కూడా ఆ కిరీటాన్ని గెలుస్తారనే నమ్మకం చాలా మందిలో ఉంది! ఆల్ ది బెస్ట్ సినీ షెట్టి.
