బెంగళూరు(Bangalore) మహానగరంలో కిరాయి ఇల్లు(Rent house) దొరకడం చాలా చాలా కష్టం.

బెంగళూరు(Bangalore) మహానగరంలో కిరాయి ఇల్లు(Rent house) దొరకడం చాలా చాలా కష్టం. వెతకంగా వెతకంగా ఓ ఇల్లు దొరికిందే అనుకోండి.. ఇంటి యజమాని అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా జవాబులు చెప్పాల్సి ఉంటుంది. అందులో పాసైతే ఓ ఏడాది అద్దెను అడ్వాన్స్‌గా చెల్లించాలి. అన్నట్టు కొందరు ఓనర్లు అయితే సర్టిఫికెట్లు కూడా అడిగి పెట్టుకుంటున్నారట! బ్రహ్మచారులకే అద్దె ఇల్లు దొరకడం దుర్లభమంటే ఇక సహజీవనం(Live-in couple) చేస్తున్న జంటల సంగతేమిటి? పాపం వారికంటూ ఓ నీడ ఉండాలి కదా! ఇలా అనుకున్న ఓ స్టార్టప్‌ వ్యాపారవేత్త బెంగళూరులో ఓ ప్రాపర్టీ కొనేశాడు. ఆ ఇంటిని సహజీవనం చేసే జంటలకు కిరాయికి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఆయన పేరు ప్రియమ్‌ సరస్వత్‌. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లే అవుట్‌(HSR Layout) సమీపంలో ఇల్లు కొన్నాడు. దాన్ని బ్యాచిలర్స్‌ లేదా సహజీవనం చేస్తున్న జంటలకు కిరాయికి ఇస్తానని చెప్పారు. కిరాయి ఇల్లు దొరక్క నానా అగచాట్లు, అవస్థలు పడుతున్న బ్రహ్మచారులకు, సహజీవనం చేస్తున్న జంటల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రియమ్‌ సరస్వత్‌ తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story