రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే చనిపోతానని తన భార్య వేధిస్తుందని పోలీసులకు సాప్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు.

రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే చనిపోతానని తన భార్య వేధిస్తుందని పోలీసులకు సాప్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. బెంగళూరు - వయ్యాలికావల్ పీఎస్(Vayalikavala PS) పరిధిలో శ్రీకాంత్ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగికి యువతితో 2022లో పెళ్లైంది. శ్రీకాంత్‌(Srikanth)కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో ఇంటి నుండే పని చేస్తున్నాడు. అయితే ఆ యువతి కాపురం చేయాలంటే రోజు రూ.5000 ఇవ్వాలని, లేదంటే రూ.45 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకోవాలని నిత్యం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ అకారణంగా తిడుతుందని.. ఏమైనా అంటే చనిపోతానని బెదిరిస్తుందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు

Updated On
ehatv

ehatv

Next Story