ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని అమ్రోహా(amroha)లో మరో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని అమ్రోహా(amroha)లో మరో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం యువతి ఓ తాంత్రికుడి దగ్గరకు వెళితే వాడు ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా అసభ్యకరమైన వీడియో తీశాడు. ఆ వీడియోను వైరల్‌ చేస్తానంటూ బెదిరిస్తూ సంవత్సర కాలంగా ఆమెపై లైంగిక దాడి చేస్తూనే వస్తున్నాడు. దాంతో పాటు లక్ష రూపాయల వరకు దోచుకున్నాడు. అంతే కాకుండా తాను చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేయసాగాడు. ఇక వాడి టార్చర్‌ భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే సంభాల్‌(sambal) జిల్లాలోని హయత్‌నగర్‌(Hayatt nagar) పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో 19 ఏళ్ల యవతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తనకు తెలిసిన ఓ తాంత్రికుడు ఉన్నాడని, అతడు ఆరోగ్య సమస్యలు తీరుస్తాడని యువతి బంధువు ఒకరు చెప్పారు. దాంతో ఆ యువతి అమాయకంగా తాంత్రికుడి దగ్గరకు వెళ్లింది, నిరుడు జూన్‌లో ఆ తాంత్రికుడు ఆ యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. దాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ బెదిరిస్తూ పలుసార్లు రేప్‌ చేశాడు. పైగా ఆ యువతి నుంచి లక్ష రూపాయల వరకు లాక్కున్నాడు. అంతే కాకుండా రాజున్హాకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు.

అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో సహచరులతో కలిసి ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాంత్రికుడు పుష్పేంద్రతో పాటు అతని సహచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.

Updated On
ehatv

ehatv

Next Story