అదృష్టమంటే శ్రీజుదే! ఏ శుభముహూర్తానా లాటరీ టికెట్‌(Lottery Ticket) కొన్నాడో తెలియదు కానీ , అతడిపై లక్ష్మీదేవి కోట్లకు కోట్లు కుమ్మరించింది. పొట్టకూటి కోసం కేరళ నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు(United Arab Emirates) వెళ్లిన 39 ఏళ్ల శ్రీజుకు(Sriju) 45 కోట్ల రూపాలయ లాటరీ తగలింది.

అదృష్టమంటే శ్రీజుదే! ఏ శుభముహూర్తానా లాటరీ టికెట్‌(Lottery Ticket) కొన్నాడో తెలియదు కానీ , అతడిపై లక్ష్మీదేవి కోట్లకు కోట్లు కుమ్మరించింది. పొట్టకూటి కోసం కేరళ నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు(United Arab Emirates) వెళ్లిన 39 ఏళ్ల శ్రీజుకు(Sriju) 45 కోట్ల రూపాలయ లాటరీ తగలింది. పదకొండేళ్లుగా శ్రీజు యూఏఈ లోనే పని చేస్తున్నాడు. ఆయిల్ గ్యాస్‌ పరిశ్రమలో కంట్రోల్‌ రూమ్‌ ఆపరేటర్‌ ఉద్యోగం అతడిది! నెల కింద పొదుపు చేసుకుంటున్న శ్రీజుకు కేరళకు(Kerala) తిరిగి వచ్చేయాలని, మంచి ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాడు. కానీ లాటరీ అతడి దశను మార్చేసింది. అసలు 45 కోట్ల రూపాయల లాటరీ తగిలిందంటే శ్రీజునే నమ్మలేకపోతున్నాడు. 'అంతా అయోమయంగా ఉంది. దాంతో పాటు సంతోషంగా కూడా ఉంది. నా కుటుంబసభ్యులంతా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు' అని సంతోషంతో చెబుతున్నాడు శ్రీజు. అరబ్‌ దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న చాలా మంది భారతీయులకు ఇంతకు ముందు ఇలాంటి లాటరీలే తగిలాయి. మొన్నటికి మొన్న యూఏఈలోని మరో కేరళవాసి శరత్‌ శివదాసన్‌కు ఎమిరేట్స్‌ డ్రా ఫాస్ట్‌ 5లో సుమారు 11 లక్షల రూపాయలు వచ్చాయి. ముంబాయికి చెందిన మనోజ్‌ భావ్సర్‌ కూడా లాటరీలో 16 లక్షల రూపాయలు గెల్చుకున్నాడు.

Updated On 17 Nov 2023 1:46 AM GMT
Ehatv

Ehatv

Next Story