తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(KCR) సుప్రీంకోర్టులో(Supreme cour) ఊరట లభించింది.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(KCR) సుప్రీంకోర్టులో(Supreme cour) ఊరట లభించింది. తెలంగాణలో విద్యుత్‌ ఒప్పందాలపై ఏర్పాటు చేసి విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని ఆదేశించింది. ఛైర్మన్‌ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటలకు కమిషన్‌ ఛైర్మన్‌గా మరో పేరును వెల్లడిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. విద్యుత్‌ కమిషన్‌ ఛైర్మన్‌(electricity commission) తీరును చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ తప్పుపట్టారు. జూన్‌ 11వ తేదీన కమిషన్‌ ఛైర్మన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారని, విచారణ పూర్తికాక ముందే అభిప్రాయం చెప్పారని, జస్టిస్‌ నరసింహారెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చేసి ప్రెస్‌మీట్‌ పెట్టడం సరికాదని తెలిపిన చీఫ్‌ జస్టిస్‌. జడ్డి నిష్పక్షపాతంగా ఉండాలని తెలిపిన ప్రధాన న్యాయమూర్తి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story