వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

'ప్రతి కుక్కను వీధి నుండి తొలగించాలని మేము ఆదేశించలేదు, ముఖ్యమైన ప్రాంతాల నుంచి మాత్రమే తొలగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్పష్టత ఇచ్చింది. వీధుల నుండి ప్రతి వీధి కుక్కను తొలగించాలని ఆదేశించలేదని నొక్కి చెప్పింది. జంతు జనన నియంత్రణ నియమాలను కచ్చితంగా పాటించడంపై దృష్టి పెట్టామని కోర్టు చెప్పింది. సంస్థాగత ప్రాంతాల నుండి కుక్కలను తొలగించాలని మాత్రమే ఆదేశించిందని పునరుద్ఘాటించింది. సున్నితమైన ప్రదేశాలలో భద్రతపై ఆందోళనలను లేవనెత్తిన ధర్మాసనం, ఆసుపత్రి వార్డులలో, రోగుల చుట్టూ కుక్కలను నియంత్రంచాలని పేర్కొంది. "ఇవి జరుగుతున్నాయని మాకు తెలుసు. పిల్లలు, పెద్దలు కాటుకు గురవుతున్నారు, ప్రజలు చనిపోతున్నారు" అని ధర్మాసనం పేర్కొంది. గత 20 రోజుల్లో, ఇద్దరు న్యాయమూర్తులు హైవేలపై విచ్చలవిడి జంతువుల వల్ల ప్రమాదాలకు గురయ్యారని, ఒక న్యాయమూర్తి పరిస్థితి విషమంగా ఉందని ధర్మాసనం పేర్కొంది.

Updated On
ehatv

ehatv

Next Story