Vishal On YS Jagan : మళ్లీ జగనే ముఖ్యమంత్రి.. హీరో విశాల్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై(CM Jagan) తమిళ హీరో విశాల్(Hero Vishal) ప్రశంసల వర్షం కురిపించాడు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని చెప్పారు. ఇంతకు ముందు కూడా జగన్పై ఇలాంటి దాడులు జరిగాయని చెబుతూ, ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని తెలిపాడు.

Vishal On YS Jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై(CM Jagan) తమిళ హీరో విశాల్(Hero Vishal) ప్రశంసల వర్షం కురిపించాడు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని చెప్పారు. ఇంతకు ముందు కూడా జగన్పై ఇలాంటి దాడులు జరిగాయని చెబుతూ, ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని తెలిపాడు. తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, కాకపోతే ముఖ్యమంత్రి జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని విశాల్ తెలిపారు. విశాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విశాల్ రత్నంఅనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆసినిమా ఈ నెల 26వ తేదీన విడుదల కాబోతున్నది. ప్రస్తుతం విశాల్ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు.
