తమిళనాడు రాష్ట్రం పెరంబూర్‌లోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్‌తో వివాహం నిశ్చయం అయ్యింది.

తమిళనాడు రాష్ట్రం పెరంబూర్‌లోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్‌తో వివాహం నిశ్చయం అయ్యింది. దీంతో బుధవారం ఉదయం బెసెంట్‌నగర్‌ ఆలయంలో వారి వివాహం జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్‌ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి.. స్నేహితులను వెంటపెట్టుకొని వెళ్లింది. ఎంత సేపటికీ అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్‌ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేశారు. కానీ అది స్విచ్‌ ఆఫ్‌లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా ఎవరూ లేరు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్‌ చేసిందని వారికి తెలిసింది. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే బ్యూటీ పార్లర్‌కు వెళ్లే వంకతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు షాక్‌కు గురయ్యారు. దీంతో వివాహ రిసెప్షన్‌ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

ehatv

ehatv

Next Story