బహుజన్‌ సమాజ్‌పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చెన్నై పెరంబూర్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బైకుల మీద వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు 47 ఏళ్ల ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు.

బహుజన్‌ సమాజ్‌పార్టీ తమిళనాడు(Tamil Nadu Bahujan Samaj Party) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌( K Armstrong) ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చెన్నై పెరంబూర్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బైకుల మీద వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు 47 ఏళ్ల ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను వెంటనే దగ్గరలో ఉన్న రాజీవ్‌గాంధీ జనరల్‌ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలతో ఆర్మ్‌స్ట్రాంగ్‌ మాట్లాడుతున్న సమయంలోనే ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ గెటప్‌తో వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. హత్యకు రాజకీయ వైరం కారణమా? లేక వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా అన్నది తేలాలి. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను బీఎస్పీ చీఫ్‌ మాయావతి(Mayawati) తీవ్రంగా ఖండించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story