Team India : రికార్డ్ సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో భారత్..
టీ20 క్రికెట్‌లో(T20 Cricket) రికార్డ్ సృష్టించడానికి భారత్(Team India) అడుగు దూరంలో నిలిచింది. బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో(Afghanisthan) జరిగే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించేందుకు భారత్ తహతహలాడుతోంది. టీ20 వరల్డ్ కప్(T20 World cup) ముందు ఆఫ్గనిస్తాన్‌తో ఆఖరి సిరీస్ ఆడుతోన్న భారత్.. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే అత్యధిక సిరీస్‌లను వైట్ వాష్ చేసిన జట్టుగా భారత్ నిలవనుంది.

Team India
టీ20 క్రికెట్‌లో(T20 Cricket) రికార్డ్ సృష్టించడానికి భారత్(Team India) అడుగు దూరంలో నిలిచింది. బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో(Afghanisthan) జరిగే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించేందుకు భారత్ తహతహలాడుతోంది. టీ20 వరల్డ్ కప్(T20 World cup) ముందు ఆఫ్గనిస్తాన్‌తో ఆఖరి సిరీస్ ఆడుతోన్న భారత్.. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే అత్యధిక సిరీస్‌లను వైట్ వాష్ చేసిన జట్టుగా భారత్ నిలవనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్.. ఈరోజు మ్యాచ్‌లో నెగ్గితే ఈ రికార్డ్ సొంతం కానుంది. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో సిరీస్‌లలో అత్యధిక వైట్‌వాష్‌లు(8) చేసిన జట్లుగా భారత్, పాకిస్థాన్(Pakisthan) కొనసాగుతున్నాయి. ఆఫ్గనిస్తాన్‌లో మూడో టీ20లో గెలిస్తే పాకిస్థాన్‌ను దాటుకొని 9 వైట్‌వాష్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ ఉండనుంది.
అఫ్గానిస్థాన్‌పై టీమ్ఇంయా 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. రెండు మ్యాచుల్లో ఆఫ్గనిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. మూడో టీ20లోనూ సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఒకవేళ భారత జట్టు గెలిచి ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీ20 వరల్డ్ కప్‌కు భారత ఆటగాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచుల్లో రాణించని రోహిత్ ఈ మ్యాచ్‌లోనైనా తన సత్తా చాటాలని క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు.
