ఉద్యోగం(Job) కోసం భర్తకు(husband) దూరంగా ఉండటం తప్పేమీ కాదని, అదేమీ క్రూరమైన చర్య కాదని అలహాబాద్‌ హైకోర్టు(Alahabad High court) అభిప్రాయపడింది.

ఉద్యోగం(Job) కోసం భర్తకు(husband) దూరంగా ఉండటం తప్పేమీ కాదని, అదేమీ క్రూరమైన చర్య కాదని అలహాబాద్‌ హైకోర్టు(Alahabad High court) అభిప్రాయపడింది. భార్యను విడిచిపెట్టడానికి, విడాకులు తీసుకోవడానికి అది అసలు కారణమే కాదని ప్రధాన తీర్పులో చెప్పింది. ఉద్యోగ రీత్యా భార్య తనకు దూరంగా ఉంటుందని, విడాకులు(Divorce) కావాలని కోర్టుకెళ్లాడో భర్త. ఈ కారణంగా విడాకులు ఇవ్వడం కుదరదని కింది కోర్టు చెప్పింది. దాంతో ఆ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీన్ని విచారించిన జస్టిస్‌ సుమిత్రా దయాల్‌ సింగ్‌, జస్టిస్‌ దోనాది రమేశ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఉద్యోగ నిర్వహణలో భాగంగా తన భాగస్వామి 21 ఏళ్లుగా తనకు దూరంగా ఉంటున్నదని పిటిషనర్‌ ఆరోపించారు. విధి నిర్వహణ కోసం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో భార్య ఔరియాలో, భర్త ఝాన్సీలో నివసిస్తున్న అంశాన్ని ఆధారంగా చేసుకుని దానిని క్రూరత్వంగా, భార్య అతడిని విడిచిపెట్టి ఉంటున్నట్టుగా నిర్ధారించలేమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. విడాకులు మంజూరు చేయడానికి నిరాకరించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story