యవరాజ్‌ సింగ్‌(Yuvraj Singh)...పోరాటం అతడి తత్త్వం. మైదానంలో అయినా, జీవితంలో అయినా ఓటమిని భరించలేడు.

యవరాజ్‌ సింగ్‌(Yuvraj Singh)...పోరాటం అతడి తత్త్వం. మైదానంలో అయినా, జీవితంలో అయినా ఓటమిని భరించలేడు. మొట్టమొదటి టీ-20 ప్రపంచకప్‌లో యువరాజ్‌ సృష్టించిన ప్రపంచ రికార్డును ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటుంటారు. 2007, సెప్టెంబర్‌ 19 తేదీన ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో యువరాజ్‌ చెలరేగిపోయాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ ఓవర్‌లో యువరాజ్‌ సింగ్‌ ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. 2011 ప్రపంచకప్‌ విజయంలో యువరాజ్‌సింగ్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భయంకరమైన క్యాన్సర్‌ వ్యాధిని కూడా యువరాజ్‌ అవలీలగా ఓడించాడు. హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడీ హీరో బయోగ్రఫీ(Biopic)వెండితెరపైకి రానుంది. ఇప్పటికే ధోని(Dhoni),సచిన్‌(sachin),అజర్‌(Ajar)వంటి క్రికెటర్ల బయోపిక్‌లు వచ్చాయి. ఇప్పుడు యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు భూషణ్‌కుమార్‌(Bhushan Kumar), రవిభాగ్‌ చందక్‌(ravibagh chandak).బాలీవుడ్‌(Ballywood)ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్‌(T-Series)భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యువరాజ్‌సింగ్‌ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Updated On
ehatv

ehatv

Next Story