మహారాష్ట్రలో(maharashtra) భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి

మహారాష్ట్రలో(maharashtra) భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల కారణంగా జనజీవితం అస్తవ్యస్తమవుతోంది. ముంబాయి(Mumbai) కూడా వర్షం దంచి కొడుతోంది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. కార్లు, మోటార్‌సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి. కొన్ని కొట్టుకుపోయాయి. ఏడు గంటలలో 300 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్‌గఢ్‌ను(Raigarh) సందర్శించడానికి వెళ్లినవారు అక్కడ చిక్కుకుపోయారు. కుండపోత వర్షం వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపారు. ముంబాయిలోనూ వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నిలిచిపోయాయి. అంధేరి, కుర్లా, భందూప్‌, కింగ్స్‌ సర్కిల్‌, దాదర్‌తో పాటు పలు ప్రాంతాలు నీటమునిగాయి. పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సబర్బన్‌ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దుచేశారు. ఆర్టీసీ బస్సులను కూడా ఆపేశారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story