గోవాలో ఎంజాయ్‌ చేద్దామని తొలిసారిగా వెళ్లిన ఢిల్లీ వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

గోవాలో ఎంజాయ్‌ చేద్దామని తొలిసారిగా వెళ్లిన ఢిల్లీ వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందాలని ఆశపడుతూ, సాగిన వారి పర్యటన చివరికి వారిని మృత్యు ఒడికి చేర్చింది. ఆదివారం తెల్లవారుజామున ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్, ఆయన భార్య భావన, ఆమె సోదరీమణులు అనిత, కమల, సరోజ్‌లతో పాటు కమల భర్త నవీన్, పిల్లలు కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లారు. ఆదివారం వరకు పర్యటన బాగానే జరిగింది. కానీ ఆదివారం తెల్లవారుజామున క్లబ్‌లో సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో టిఫిన్‌ చేసి, తిరిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఎలాగోలా బయటకు పరుగుపెట్టిన భావన, తన సోదరీమణులు లోపల చిక్కుకోవడాన్ని గమనించి ఉలిక్కిపడింది.

మరోవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెడుతున్న జనాన్ని చూసి కూడా.. భావన తన అక్కాచెల్లెళ్లను కాపాడేందుకు ధైర్యంగా మంటల్లోకి వెళ్లింది. వినోద్ కుమార్ కూడా ఇదే ప్రయత్నంలో భావన వెంట వెళ్లారు. అంతకంతకూ ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగకు తోడు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో వారు కూడా ఆ మంటల మధ్యలో చిక్కుకున్నారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు సోదరీమణులు.. అనిత, కమల, సరోజ్, భావన భర్త వినోద్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. భావన మాత్రం ఎలాగోలా బయటపడింది.

Updated On
ehatv

ehatv

Next Story