TRAI Fraud Calls : అలాంటి కాల్స్‌తో మీరు జాగ్రత్త... ట్రాయ్ హెచ్చరిక
మోసపూరిత కాల్స్(Fraud Calls) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెలికం(Telecom) నియంత్రణ సంస్థ (TRAI) సూచించింది. ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నామని కొందరు చెబుతున్నారని, మెసేజ్‌లు(Messages) పంపుతున్నారని, ఈ విధంగా ప్రజలను మోసగిస్తున్నారని ట్రాయ్ తెలిపింది.

TRAI Fraud Calls
మోసపూరిత కాల్స్(Fraud Calls) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెలికం(Telecom) నియంత్రణ సంస్థ (TRAI) సూచించింది. ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నామని కొందరు చెబుతున్నారని, మెసేజ్‌లు(Messages) పంపుతున్నారని, ఈ విధంగా ప్రజలను మోసగిస్తున్నారని ట్రాయ్ తెలిపింది. కొన్ని కంపెనీలు, ఏజెన్సీలు, కొందరు వ్యక్తులు ఇలా మోసం చేస్తున్నారని, వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నట్టు చెప్పుకునే కాలర్లు మీ నంబర్లను డిస్‌కనెక్ట్ చేస్తామని బెదిరిస్తారని, వారి మాటలు పట్టించుకోవద్దని ప్రకటించింది. ఆధార్ నంబర్లను సిమ్ కార్డ్స్ పొందేందుకు ఉపయోగించారంటూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అట్టి సిమ్‌లను ఉపయోగిస్తున్నారంటూ లేనిపోని భయాలు కల్పిస్తారని, ఇలా కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొబైల్ నంబర్ డిస్‌కనెక్ట్ కాకుండా ఉండాలంటే స్కైప్ వీడియో కాల్ చేయాల్సిందిగా కస్టమర్‌కు వారు సూచిస్తున్నారని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ ఏ వ్యక్తిగత టెలికం కస్టమర్ల మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడం లేదా డిస్‌కనెక్ట్ చేయదని, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని ట్రాయ్ సూచించింది.
