మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో (Indore) ఘోరం జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో (Indore) ఘోరం జరిగింది. ఇండోర్‌లోని మోవ్‌ ఆర్మీ కాలేజీలో టైనింగ్‌ తీసుకుంటున్న ఇద్దరు ఆర్మీ అధికారులు తమ గర్ల్‌ ఫ్రెండ్స్‌తో కలిసి చొట్టి జామ్‌ (Chotti Jam) దగ్గర ఉన్న ఫైరింగ్ రేంజ్‌ దగ్గరకు వెళ్లారు. అక్కడే ఉన్న కొందరు దుండగులు వారిని చుట్టుముట్టారు. తుపాకులు, కత్తులు, కర్రలతో బెదిరించారు. వారి దగ్గర ఉన్న డబ్బు నగలను తీసుకున్నారు. తర్వాత ఇద్దరు అమ్మాయిలలో ఒకరిపై సామూహిక అత్యాచారం చేశారు. దుండగుల నుంచి తప్పించుకున్న ఓ ట్రైనీ ఆఫీసర్‌(Trainee Officer) తన యూనిట్‌కు చేరుకుని కమాండింగ్‌ ఆఫీసర్‌కు జరిగినది చెప్పాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మీ అధికారులతో కలిసి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే వారు అక్కడ్నుంచి పారిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షలతో తెలిసింది.. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరికి క్రిమినల్ రికార్డు కూడా ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story