స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా రామ్‌చరణ్‌(Ram Charan) భార్య ఉపాసన(Upsana)చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా రామ్‌చరణ్‌(Ram Charan) భార్య ఉపాసన(Upsana)చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. కోల్‌కతా(Kolkata)లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడ ఉందని ఉపాసన ప్రశ్నిస్తున్నారు. ఇంతటి అనాగరిక సమాజంలో మనం బతుకుతున్నామా? అని నిలదీస్తున్నారు. మెడికల్‌ ప్రొఫెసన్‌లపైనే ఇంతటి దారుణాలు జరుగుతుంటే సాధారణ పౌరుల ప్రాణాలకు రక్షణ ఎక్కడ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఇప్పటికీ అనాగరిక సమాజంలోనే బతుకుతున్నామని, ఏమని స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని ఉపాసన అడుగుతున్నారు. మహిళలే దేశానికి వెన్నెముక లాంటివారని, ఇప్పటికే దాదాపు 50శాతం మంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని ఉపాసన తెలిపారు. దేశంలో ప్రతి మహిళ భద్రత, గౌరవం కాపాడేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాసన సూచించారు.

Updated On
ehatv

ehatv

Next Story