వివాహేతర సంబంధాలు.. వాటి పర్యవసనాలు ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం.

వివాహేతర సంబంధాలు.. వాటి పర్యవసనాలు ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది. అనైతిక బంధాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లా కాస్గాని జిల్లా సిధ్పురలో ఓ మహిళ హత్య కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలను బయటకు తీశారు. పోలీసుల వివరాల ప్రకారం.. 2018లో శివాని, ప్రమోద్ల వివాహం జరిగింది. ఈ జంటకు రెండున్నరేళ్ల బాలుడు, ఆరు నెలల ఓ పాప ఉన్నారు. అయితే.. గత ఆరు నెలలుగా శివాని తల్లి ప్రేమావతితో అల్లుడు ప్రమోద్ అనైతిక సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి శివాని భర్తను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ప్రేమావతిని కూర్చోబెట్టి పెద్దలు పంచాయితీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో అక్టోబర్ 6వ తేదీన ఆ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ గొడవ సందర్భంగా కోపంలో శివానిని ప్రమోద్ హతమార్చి.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మరోవైపు ప్రేమావతి కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా వాళ్ల వెంటే పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శివాని తండ్రి నారాయణ సింగ్ ఫిర్యాదుతో పరారీలో ఉన్న ప్రమోద్ కుటుంబ సభ్యుల కోసం, శివానీ తల్లి ప్రేమావతి కోసం గాలింపు చేపట్టారు. ఇంతలోగా ప్రేమావతి, ప్రమోద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో వీరి వ్యవహారం చర్చనీయాంశమైంది.
