Varunraj Incident In America : అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తిపోట్లు..!
అమెరికాలో(America) ఖమ్మం(Khammam) జిల్లా మామిళ్లగూడానికి చెందిన తెలుగు విద్యార్థి వరుణ్‌రాజ్‌పై(Varunraj) ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. వాషింగ్టన్‌లోని(Washington) లూథరన్ ఆస్పత్రిలో(Lutheran Hospital) చికిత్స పొందుతున్నాడు.

Varunraj Incident In America
అమెరికాలో(America) ఖమ్మం(Khammam) జిల్లా మామిళ్లగూడానికి చెందిన తెలుగు విద్యార్థి వరుణ్‌రాజ్‌పై(Varunraj) ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. వాషింగ్టన్‌లోని(Washington) లూథరన్ ఆస్పత్రిలో(Lutheran Hospital) చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇంకా కోమాలోనే(Coma) ఉన్నాడు. లైఫ్ సపొర్టుపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎడమవైపు పాక్షికంగా వైకల్యం ఏర్పడే అవకాశముందని వైద్యులు తెలిపారు. తమ దేశంలో తెలుగు విద్యార్థిపై కత్తిపోట్ల పట్ల అమెరికా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఆకాంక్షించారు. వరుణ్‌రాజ్ చికిత్స, తల్లిదండ్రుల అమెరికా ప్రయాణంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం గోఫండ్‌లో విరాళాల సేకరణ చేపట్టింది.
