సోషల్‌ మీడియాలో(social media) ఓవర్‌నైట్‌ పాపులరవ్వాలనే తపనతో పిచ్చి పచ్చి రీల్స్‌(Reels) చేస్తున్నారు యువతీ యువకులు.

సోషల్‌ మీడియాలో(social media) ఓవర్‌నైట్‌ పాపులరవ్వాలనే తపనతో పిచ్చి పచ్చి రీల్స్‌(Reels) చేస్తున్నారు యువతీ యువకులు. పడరాని పాట్లు పడుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇలాగే మహారాష్ట్రలోని(Maharashtra) పుణేలో(Pune) ఓ యువతి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రమాదకరంగా గాల్లో వేలాడుతూ రీల్‌ చేసింది. పుణేలోని స్వామి నారాయణ్‌ ఆలయ సమీపంలో ఎవరూ లేని ఓ పాడుపడిన భవంతిపై ఓ జంట రిస్కీ స్టంట్‌ చేసింది. యువకుడి చేయి పట్టుకున్న ఓ యువతి టెర్రస్‌ అంచు నుంచి ప్రమాదకరంగా గాలిలో వేలాడింది. ఆ బిల్డింగ్‌ పక్కనే రోడ్డు ఉంది. ఆ జంటకు చెందిన స్నేహితులు మొబైల్‌ ఫోన్‌లో ఈ స్టంట్‌ను షూట్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చూసిన వాళ్లంతా ఆ యువతిని తిట్టిపోస్తున్నారు. సోషల్‌ మీడియాలో లైక్స్‌ రావడానికి ఇలా ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్లు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతీయువకులతో పాటు ఫ్రెండ్స్‌ను కూడా అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story