DGP Rank Officer 'RasaLeelalu: ఏకంగా డీజీపీ ఆఫీసులోనే మహిళతో రాసలీలలు..!! సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న వీడియోలు..!

కర్నాటకలో ఓ పెద్ద పోలీసు అధికారి మహిళలతో రాసలీలలకు పాల్పడుతూ ఏకంగా తన కార్యాలయంలోనే పట్టుబడ్డాడు. డీజీపీ కార్యాలయంలో పోలీసు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియా ఒకటి కలకలం రేపుతోంది. రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్న ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వీడియోలు ఇప్పుడు బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
డీజీపీ ఆఫీసులో సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా డా. రామచంద్రరావు పనిచేస్తున్నారు. అయితే, రామచంద్రరావు.. ఆఫీసులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ మహిళ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో అసభ్యకరంగా ఆమెను తాకడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేశారు. అయితే ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీ రాసలీలలను వీడియోలను ఆఫీసులో పనిచేస్తున్న కొందరు రికార్డు చేసినట్టు తెలిసింది.
https://twitter.com/i/status/2013204851157577818
తీవ్ర దుమారం చెలరేగడంతో రాసలీలల వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. అయితే ఈ అంశంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలపై అధికారి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయంలోనే ఈ వ్యవహారం జరగడంతో అక్కడి పోలీసు శాఖలో క్రమశిక్షణపై సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఆఫీసు ఘటన పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ విషయంపై పోలీసు అధికారి రామచంద్రరావు స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, కొందరు తనకు వ్యతిరేకంగా ఉండే శక్తులు ఈ వీడియోని ఏఐతో సృష్టించారని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.


