సినిమాల్లో కథానాయకుడిలా ఓ పోలీసు కానిస్టేబుల్‌(Police constable) దొంగను పట్టుకున్నాడు.

సినిమాల్లో కథానాయకుడిలా ఓ పోలీసు కానిస్టేబుల్‌(Police constable) దొంగను పట్టుకున్నాడు. కర్నాటకలోని(Karnataka) సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్ జంక్షన్‌లో ఈ హీరోచిత ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో చిక్కడంతో కానిస్టేబుల్‌ దొడ్డ లింగయ్య సాహసం వెలుగులోకి వచ్చింది. మంజేష్‌ అనే దొంగ టూ వీలర్‌ మీద వెళుతుంటే పసికట్టిన పోలీసు అతడిని వెంబడించి పట్టుకున్నాడు. పదికిపైగా దొంగతనం కేసులు ఇతడిపై ఉన్నాయి. తుమకూరు పోలీసులు ఇతగాడి కోసం వెతుకుతున్నారు. ప్రభుత్వ నిధులు ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేయడమే కాకుండా, మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను తెంపుకుని పారిపోయేవాడు. సదాశివనగర్‌వైపు మంజేష్‌ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న దొడ్డ లింగయ్య అతడి కోసం కాపుకాచాడు. అతడు సిగ్నల్‌ దగ్గరకు రాగానే పరుగెత్తుకుంటూ వెళ్లి పట్టుకున్నాడు. మంజేష్‌ అప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. స్కూటర్‌ను ముందుకు పరుగెత్తించాడు. అయినా దొడ్డలింగయ్య అతడిని వదల్లేదు. అతడి కాళ్లు గుంజి రోడ్డు మీద పడేశాడు. అప్పటికే అలెర్టయిన ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి వచ్చి మంజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు ప్రజలు కూడా తలో చేయి వేసి సహకరించారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story