బీజేపీ(BJP) పాలిత గుజరాత్‌(Gujarat) రాష్ట్రంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

బీజేపీ(BJP) పాలిత గుజరాత్‌(Gujarat) రాష్ట్రంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వదోదరలో ఉన్న శ్రీ నారాయణ్‌ విద్యాలయ్‌(Sri narayana school) పాఠశాల గోడ కూలింది. పిల్లందరూ తరగతి గదిలో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ఏడో తరగతి చదువుతున్న ఒక పిల్లోడికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థి ధైర్య సుతార్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఇతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఒక్కసారిగా గోడ కూలడంతో(wall Colapse) పిల్లలు భయభ్రాంతులయ్యారు. బ్రేక్‌ సమయంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొన్ని సైకిళ్లు మాత్రం ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలికి వచ్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story