అమెరికాలో(America) భారత సంతతికి చెందిన వారిపై ఈ మధ్యన వరుసగా దాడులు జరుగుతున్నాయి. చంపడానికి కూడా దుండగులు వెనుకాడటం లేదు. కొందరు భారతీయులు(Indians) చనిపోయారు కూడా! ఈ నేపథ్యంలో వరుసదాడులపై అమెరికాలోని శ్వేతభవనం(White House) వర్గాలు స్పందించాయి. భారతీయులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వైట్‌ హౌస్‌ పేర్కొంది.

అమెరికాలో(America) భారత సంతతికి చెందిన వారిపై ఈ మధ్యన వరుసగా దాడులు జరుగుతున్నాయి. చంపడానికి కూడా దుండగులు వెనుకాడటం లేదు. కొందరు భారతీయులు(Indians) చనిపోయారు కూడా! ఈ నేపథ్యంలో వరుసదాడులపై అమెరికాలోని శ్వేతభవనం(White House) వర్గాలు స్పందించాయి. భారతీయులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వైట్‌ హౌస్‌ పేర్కొంది. అమెరికాలో జాతి వివక్షకు, హింసకు తావు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ(John Curby) పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఈ విధంగా ఆయన స్పందించారు. ‘జాతి, ప్రాంతం, స్త్రీ పురుష భేదాలతో పాటు మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమించదగినవి కావు. అమెరికా ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోంది. వీటిని అరికట్టడానికి జో బైడెన్‌ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది. దాడులకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షిస్తాం' అని జాన్‌ కర్బీ అన్నారు. గురువారం కూడా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అలబామాలో హోటల్‌ నడుపుతున్న ప్రవీణ్‌ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గదికోసం వచ్చిన ఒక కస్టమర్‌ కాల్చి చంపాడు. ఇదిలా ఉంటే, అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ నేత అజయ్‌ జైన్‌ అన్నారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, స్థానిక పోలీసులు దీనిపై వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated On 16 Feb 2024 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story