ఓ వ్యక్తి క్షుద్రపూజలకు(occult worship) అలవాటు పడ్డాడు.

ఓ వ్యక్తి క్షుద్రపూజలకు(occult worship) అలవాటు పడ్డాడు. తన కొడుకును బలి(sacrifice) ఇస్తే సంపద(Wealth) వస్తుందని నమ్మాడు. అందుకు భార్య అంగీకరించలేదని ఆమెను వేధించసాగాడు దీంతో ఆమె పోలీసులను సంప్రదించి తనకు, తన కొడుక్కి న్యాయం కావాలని కోరింది. కర్నాటక రాజధాని బెంగళూరు(Bangalore) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ కమీషనర్ కార్యాలయం ఆమె ఫిర్యాదును తీసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటోంది. బాధితురాలు 2020లో ఓ లాజిస్టిక్‌ కంపెనీలో పనిచేస్తుండగా సదమ్‌ అలియాస్ ఆది ఈశ్వర్ పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుందామని బాధితురాలని కోరాడు. నవంబర్ 2020లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ, సదమ్ ఆమెను ముస్లిం ఆచారాల ప్రకారం తిరిగి వివాహం చేసుకోమని బలవంతం చేశాడు, అదృష్టం కలుగుతుందని నమ్మబలికాడు. ఆమెను తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా ఇస్లాంలోకి మార్చుకుని పేరు మార్చాడు. ముస్లిం వివాహ ధృవీకరణ పత్రంపై సంతకం చేయమని బలవంతం చేశాడు. తర్వాత బాధితురాలు గర్భవతయింది. అప్పటికే భర్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. జూలై 15, 2021న తన కుమారుడికి జన్మనిచ్చింది. అయితే క్షుద్రపూజలకు అలవాటు పడిన భర్త సదాం.. వారి కొడుకును బలిచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఇది అంగీకరించని తల్లి ఇంటి నుంచి పారిపోయింది. అక్కడి నుంచి తుమకూరుకు వెళ్లింది. అక్కడికి కూడా తన స్నేహితుడు నయాజ్‌తో కలిసి వెళ్లి బాలుడిని ఎత్తుకొచ్చేందుకు బలవంతం చేశాడు. స్థానికుల సాయంతో ఆమె అక్కడినుంచి తప్పించుకోగలిగింది. దీంతో పోలీసులను ఆశ్రయించగా భర్త సదాం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story