ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెంపుడు పిల్లి చనిపోయిందని రెండు రోజుల పాటు బాధపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెంపుడు పిల్లి చనిపోయిందని రెండు రోజుల పాటు బాధపడింది. మూడో రోజు దాన్ని పెంచుకున్న మహిళ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన పిల్లి మళ్లీ బతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు తన పెంపుడు పిల్లి మృతదేహంతోనే గడిపింది. చివరికి మూడో రోజు ఆత్మహత్యకు పాల్పడింది. హసన్‌పూర్‌లో నివసించే 32 ఏళ్ల పూజకు ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం కాగా.. రెండేళ్ల తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. దీంతో నాటి నుంచి తల్లి గజ్రా దేవి వద్దనే పూజ ఉంటోంది. ఒంటరితనం నుంచి ఉపశమనం పొందేందుకు ఓ పిల్లిని తెచ్చుకుని పెంచుకుంటోంది. అనుకోకుండా ఆ పిల్లి చనిపోవడంతో తీవ్ర ఆవేదన చెందింది. పిల్లి మృతదేహాన్ని పూడ్చిపెట్టాలని తల్లి చెప్పినా ఒప్పుకోలేదు. పిల్లి తిరిగి బతికి వస్తుందని రెండు రోజులపాటు దాని మృతదేహంతోనే గడిపింది. దాన్ని పూడ్చిపెట్టాలని ఎన్నిసార్లు కుటుంబసభ్యులు చెప్పినా వినిపించుకోలేదు. రెండురోజులపాటు చూసిన పూజ తన ఇంటి మూడో అంతస్తులోని గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. కూతురును వెతుకుతూ వచ్చిన తల్లికి కూతురు ఫ్యాన్‌కు వేలాడుతుండడం చూసి ఒక్కసారిగా రోదించించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని కిందికి దించి దర్యాప్తు చేపట్టారు.
