వివాహేతర సంబంధాలపై మోజులో మానవత్వం మంటకలిసిపోతుంది.

వివాహేతర సంబంధాలపై మోజులో మానవత్వం మంటకలిసిపోతుంది. ప్రియుని కోసం రాగి ముద్దలో విషం కలిపి అత్తను హత్య చేసిన ఘటన కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకా తడగ గ్రామంలో జరిగింది. అశ్విని అనే మహిళ తన అత్త దేవీరమ్మ (75) హతమార్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వివాహిత అశ్వినికి ఆంజనేయ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి అత్త ఆమెను తీవ్రంగా మందలించింది. ఇటీవల అశ్విని ఇంట్లో నగలను తీసుకుని ప్రియునికి అప్పగించింది. ఇది తెలిసి కోడలిని అత్త నిలదీసింది. తమకు అడ్డుగా ఉన్న దేవీరమ్మను అడ్డు తొలగించాలని అశ్విని నిశ్చయించుకుంది. గురువారం రాత్రి రాగిముద్దలో పురుగుల మందును కలిపి అత్తకు ఇచ్చింది. అది తిన్న దేవీరమ్మ తెల్లవారినా నిద్రలేవలేదు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్లు అశ్విని అందరికీ చెప్పింది. అయితే తల్లి చావుపై దేవీరమ్మ కూతురికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అశ్వినిని పిలిచి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకొంది. ప్రియుడు ఆంజనేయను కూడా అరెస్టు చేశారు. అంతేకాకుండా 100 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును అశ్విని స్వాహా చేసిందని బంధువులు తెలిపారు.

ehatv

ehatv

Next Story