ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో లా అండ్‌ ఆర్డర్‌ను గాలికి వదిలేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(CM Yogi Adityanath) నేరస్తుల పాలిటి సింహస్వప్నం అంటూ బీజేపీ(BJP)వాళ్లు కితాబిస్తారు కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం క్రైమ్‌ రేట్(Crime Rate) దారుణంగా ఉంది.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో లా అండ్‌ ఆర్డర్‌ను గాలికి వదిలేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(CM Yogi Adityanath) నేరస్తుల పాలిటి సింహస్వప్నం అంటూ బీజేపీ(BJP)వాళ్లు కితాబిస్తారు కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం క్రైమ్‌ రేట్(Crime Rate) దారుణంగా ఉంది. ఆ రాష్ట్ర రాజధాని లక్నో(Lucknow) కూడా ఇందుకు అతీతం కాదు. లక్నోలో బైక్‌ మీద వెళుతున్న ఓ మహిళపై అల్లరి మూక వేధింపులకు దిగింది. తాజ్‌ హోటల్‌ బ్రిడ్జ్‌(Taj Hotel Bridge)పై ప్రవహిస్తున్న వర్షపు నీటిలోంచి ఓ వ్యక్తితో కలిసి బైక్‌పై వెనక కూర్చుని వస్తున్న మహిళపై అల్లరి మూక వెకిలి చేష్టలు చేసింది. అప్పటికే నీళ్లలో దిగి వెకిలి చేష్టలు చేస్తున్న దాదాపు 15 మంది యువకులు.. మహిళపై వర్షపు నీళ్లు చల్లుతూ వేధించారు. వాహనంపై నుంచి ఆమెను నీటిలో పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On
ehatv

ehatv

Next Story