బెంగళూరులో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతిని అత్యంత దారుణంగా చంపేసి

బెంగళూరులో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతిని అత్యంత దారుణంగా చంపేసి, శవాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుడి కోసం పోలీసులు ఒడిశా(Odisha), పశ్చిమ బెంగాల్‌(West Benagl), ఈశాన్య రాష్ట్రాలలో వెతుకుతున్నారు. అయితే నిందితుడు ముక్తి రంజన్‌ రాయ్‌(Mukthi Niranjan Roy)ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో అతడు ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. బెంగళూరులోని హత్యకు గురైన యువతికి ఉన్న ముగ్గురు క్లోజ్‌ ఫ్రెండ్స్‌లో ముక్తి రంజన్‌రాయ్‌ ఒకడు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు. బెంగళూరులోని నెలమంగల సమీపంలో యువతిని ముక్కలుగా నరికి, రిఫ్రిజిరేటర్‌లో కుక్కి.. ‘సడోమా సూకిస్ట్‌క్‌(Sodom Sookistk)’ అనే నేరస్వభావంతో నిందితుడు రగిలిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు

Updated On
ehatv

ehatv

Next Story