గంగానదిని(Ganga River) ఎంత పవిత్రంగా చూస్తామో, యమునా నదిని(Yamuna river) కూడా అలాగే భావిస్తాము.

గంగానదిని(Ganga River) ఎంత పవిత్రంగా చూస్తామో, యమునా నదిని(Yamuna river) కూడా అలాగే భావిస్తాము. ఆ నదీమతల్లి హిమాలయాలలోని(himalaya) యమునోత్రి దగ్గర పుడుతుంది. అలహాబాద్‌లోని గయ దగ్గర గంగానదిలో కలుస్తుంది. సప్త గంగలలో ఒకటైన యమునా నది ఇప్పటికే కాలుష్యపు(Pollution) కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నది. చిక్కి శల్యమైపోతున్నది. గంగలో మునిగితే లభించని పుణ్యం యమున నదిలో మునిగితే వస్తుందన్నది పెద్దల మాట! ఇప్పుడు యమునలో మునిగితే పుణ్యం మాట అటుంచితే రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది. అంత భయంకరంగా తయారయ్యింది. విషపు నురగలు భక్తులను భయపెట్టిస్తున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు యమునలో కలుస్తున్నాయి. ఫలితంగా విషపు నురుగులు తేలుతున్నాయి. 90 శాతం వ్యర్థ జలాలు, 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ది చేయని మురుగు నీటిని కూడా యుమునా నదిలోకే వదిలేస్తున్నారు. మురుగు నీటిలో ఉండే పాస్ఫేట్, ఆమ్లాలు విషపూరిత నురుగుగా ఏర్పడటానికి కారణమవుతున్నాయి. యమునా నది హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తూ ప్రయాగ దగ్గర గంగా నదిలో కలుస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రవహించే యమున ఇప్పుడు విషాన్ని విరజిమ్ముతోంది. నదిలో కలిసిన రసాయనాల నురుగులుగా తేలుతున్నాయి. నదిలో స్నానం చేయాలంటే వణుకు పుడుతోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story