ఫుడ్‌ డెలివరీలో(Food delivery) క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జొమాటో(Zomato)..

ఫుడ్‌ డెలివరీలో(Food delivery) క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జొమాటో(Zomato).. మరో కొత్త ఆలోచనకు నాంది పలికింది. ఆహారాన్ని వెస్ట్ చేయకుండా(Food wastage), ఎవరైనా కస్టమర్లు ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలను తక్కువ ధరకు మరో కస్టమర్‌కు అందించడం కోసం 'ఫుడ్‌ రెస్క్యూ'(Food rescue) అనే ఫీచర్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి పలు సూచనలు చేయాలని కోరింది. దీంతో బెంగళూరుకు చెందిన 'భాను' అనే వ్యక్తి ఇచ్చిన సూచనలకు జొమాటో సీఈవో మైమరిచిపోయారు. భానుకు ఏకంగా జొమాటోలో జాబ్‌ ఆఫర్‌(Job offer) చేశారు.

Zomato ఇటీవల ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌ను ప్రకటించింది, ఇది రద్దు చేసిన ఆర్డర్‌లను సమీపంలోని కస్టమర్‌ల కోసం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచడం ద్వారా ఆహార పదార్థాల వేస్ట్‌ చేయకుండా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. కొంతమంది వినియోగదారులు ఫీచర్ వల్లే జరిగే దుర్వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బెంగళూరుకు చెందిన క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లకు ఫుడ్ రెస్క్యూ ఆప్షన్ అందుబాటులో ఉండరాదని, డెలివరీ బాయ్‌ దగ్గరలో ఉండగా కస్టమర్‌లు తమ ఆర్డర్‌లను రద్దు చేసుకోవడానికి అనుమతించకూడదని ఆయన సూచించారు. ఒక కస్టమర్ రోజుకు రద్దు చేయగల ఆర్డర్‌ల సంఖ్యపై పరిమితి విధించాలని సూచించాడు. భాను సూచనలకు గోయల్ ప్రతిస్పందిస్తూ 'మంచి ఆలోచన' అని అన్నారు. మీరు ఏం చేస్తారు.. మిమ్మల్ని మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నాం. మాతో కలిసిపనిచేయగలరా' అని గోయల్‌ కోరారు. ఫుడ్‌ రెస్క్యూ ఫీచర్‌తో ఆహార పదార్థాలను వ్యర్థం తగ్గుతుందన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story