పాతకాలపు సైకిళ్లతో పాటు లేటెస్ట్‌గా తయారు చేసిన సైకిళ్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చు.. పరిమాణంలో వచ్చిన వ్యత్యాసాలను కూడా గమనించవచ్చు.. చూడముచ్చటగొలిపే సైకిళ్లు ఓ పట్టాన మ్యూజియం నుంచి బయటకు రానివ్వవు.. రకరకాల రంగులలో దర్పంగా నిలుచుకున్న సైకిళ్లను చూసి మనసు పారేసుకోకుండా ఉండలేం.. క్రెయిగ్‌ మోరో అనే ఆయన కృషి ఫలితమే ఈ మ్యూజియం! మూడు దశాబ్దాలుగా సైకిళ్లను సేకరిస్తూ వస్తున్నారాయన! అలా సేకరించినవాటితోనే ఏడేళ్ల కిందట ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.. దానికి చక్కగా సైకిల్‌ హెవెన్‌ అని పేరు పెట్టారు.. ఇప్పుడీ మ్యూజియంను చూసేందుకు పర్యాటకులు క్యూలు కడుతున్నారు

Updated On 3 Jun 2023 12:40 AM GMT
Ehatv

Ehatv

Next Story